తేనె తీయడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు.. ప్రమాదవశాత్తూ మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కోసిగి మండలం సజ్జలగూడెంలో అన్నదమ్ములు తేనె పట్టుకి నిప్పు పెట్టారు. ప్రమాదవశాత్తు నిప్పు చెలరేగి అన్నదమ్ములైన ఆ చిన్నారులకు మంటలు అంటుకొన్నాయి. ఈ ఘటనలో.. గోవర్ధన్ రెడ్డి (7) అక్కడికక్కడే మృతిచెందగా, వీర రెడ్డికి (9) తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స కోసం బాలుడిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తేనె తీయటానికి వెళ్లి అన్నదమ్ములు మృతి - సజ్జలగూడెంలో అన్నాదమ్మలు మృతి న్యూస్
కర్నూలు జిల్లా కోసంగి మండలం సజ్జలగూడెంలో విషాదం జరిగింది. తేనె తీయటానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు నిప్పు అంటుకొని ప్రమాదవశాత్తు మృతిచెందారు.
తేనె తీయటానికి వెళ్లి అన్నాదమ్ములు మృతి