వరుసకు చెల్లెలు అవుతుందన్న బాంధవ్యాన్ని మరిచిపోయాడు. పెళ్లి కుదిరిన వేళ.. ఆశీర్వదించాల్సిన చేతితోనే.. నిర్దాక్షిణ్యంగా గొంతు కోసేశాడు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతికి ఓ వ్యక్తితో వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. ఈ సంబంధం వద్దని జ్యోతి పెద్దమ్మ కొడుకు సుబ్బరాయుడు వారించాడు. అయినా.. ఆయన మాట వినకుండా.. పెళ్లి పనులు కానిచ్చేశారు. తన చెల్లి పెళ్లి జరగబోతోందని కోపోద్రిక్తుడైన సుబ్బరాయుడు... దారుణానికి తెగబడ్డాడు. పెళ్లిని ఎలాగైనా ఆపాలని.. చెల్లెలు జ్యోతి గోంతు కోసేశాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జ్యోతికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెల్లె పెళ్లి చేసుకుంటోందని.. సోదరుడి కిరాతకం! - kurnool
తనకు ఇష్టం లేని వ్యక్తితో చెల్లెలు పెళ్లి చేసుకుంటోందని.. ఓ అన్న.. అదీ పెద్దమ్మ కొడుకు.. ఆగ్రహించాడు. చెల్లెలి గొంతు కోశాడు.
పెళ్లి చేసుకుంటోందని సోదరుడి కిరాతం