శ్రీశైలం ఆనకట్ట వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. సాయంత్రం కురిసిన వర్షానికి పెద్ద పెద్ద రాళ్లు ఆనకట్ట ప్రవేశ గేటు వద్దకు వచ్చి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేని కారణంగా.. పెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రదేశంలో నిత్యం ఆనకట్ట ఉద్యోగులు, పర్యటకులు సంచరిస్తుంటారు. పరిసరాల చుట్టూ కొండచరియలకు ఫెన్సింగ్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆనకట్ట ప్రవేశం వద్దే కొండచరియలు విరిగి పడుతుండడంతో జలవనరుల శాఖ, ఎస్పీఎఫ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.