కర్నూలు జిల్లా మద్దికెర - పత్తికొండ ప్రధాన రహదారిలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి కర్నూలు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం హఠాత్తుగా వంతెన కూలిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కూలిన సమయంలో వాహనాలేవీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని గ్రామస్థులు తెలిపారు. వాహనాల రాకపోకలకు మరో మార్గం లేనందున అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
కూలిన వంతెన.. నిలిచిపోయిన రాకపోకలు - bridge collapsed news
కర్నూలు జిల్లా మద్దికెర - పత్తికొండ ప్రధాన రహదారిలోని వంతెన కూలిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో స్థానికులు ఆందోళన చెందారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రాకపోకలు పునరుద్ధరించాలని కోరారు.
కూలిన వంతెన