ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తనువు చాలించి.. నలుగురికి ప్రాణదాతగా నిలిచిన చరిత - అవయవదానం చేసిన బ్రెయిన్ డెత్ అయిన మహిళ కుటుంబసభ్యులు

కర్నూలు జిల్లాలో ఓ బాలింత మరణించి నలుగురికి ప్రాణదాతగా మారింది. తెలంగాణకు చెందిన ఓ మహిళ.. తమ మొదటి ప్రసవంలో కుమారుడికి జన్మనిచ్చారు. తర్వాత కొన్నిరోజులకు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మహిళను కర్నూలులోని ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో వారి కుటుంబసభ్యులు.. ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

woman donated organs
ప్రాణదాతగా నిలిచిన మహిళ

By

Published : Jul 3, 2022, 11:32 AM IST

తెలంగాణలోని గద్వాలకు చెందిన చరిత అనే యువతి బ్రైన్ డెడ్ కావడంతో.. ఆమె అవయాలను దానం చేసి కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. 20 రోజుల క్రితం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకి జన్మనిచ్చిన చరిత.. డెలివరీ తర్వాత కోమలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 20 రోజుల పాటు చికిత్స పొందినా.. ఆరోగ్యం మెరుగవలేదు. దీంతో కుటుంబసభ్యులు అవయవదానం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్ ఆసుపత్రులకు గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను పంపారు. గుంటూరు ఎన్​ఆర్​ఐ ఆసుపత్రికి కాలేయం, నెల్లూరు అపోలో ఆసుపత్రికి కిడ్నీని తరలించారు. మరో కిడ్నీని కర్నూలులోనే రోగికి అమర్చారు. అవయవాలు దానం చేసిన చరిత మృతదేహానికి కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details