ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన కర్నూలు జిల్లా అహోబిలంలో మార్చి 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఎగువ, దిగువ అహోబిలం ఆలయాల్లో మార్చి 29 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల సబ్ కలెక్టరు కార్యాలయంలో అన్నీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథరెడ్డి, సబ్ కలెక్టరు కల్పన కుమారి హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఉత్సవాల నిర్వహణ, తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, రవాణా సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు.
మార్చి 18 నుంచి అహోబిలంలో బ్రహ్మోత్సవాలు
కర్నూలు జిల్లా అహోబిలంలో మార్చి 18 నుంచి బ్రహోత్సవాలు జరగనున్నాయి. నంద్యాల సబ్ కలెక్టరు కార్యాలయంలో అన్నీ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ, తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, రవాణా సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు.
ఆహోబిలంలో మార్చి 18 నుంచి బ్రహ్మోత్సవాలు
Last Updated : Feb 25, 2021, 10:43 PM IST