కర్నూలు జిల్లా నంద్యాలలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలురు మృతి చెందారు. నంద్యాల మండలం రాయమలుపురంలో కిషోర్(15) అనే యువకుడు ఇంట్లో విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
ఎన్జీఓ కాలనీలోని కేసీ కాలువలో పడి నూనెపల్లెకు చెందిన ఇర్ఫాన్(11) అనే బాలుడు మృతి చెందాడు. పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి కాలువలో పడి మరణించాడు. ఇరువురి మృతి ఆ కుటుంబాల్లో విషాదం నింపింది.