ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేలిన నాటుబాంబు... బాలుడికి తీవ్ర గాయాలు - కర్నూలు జిల్లా నేటి వార్తలు

కర్నూలు జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. బాంబులు పేలి 12 సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Boy injured in bomb blast in sanjamala kurnool district
పేలిన నాటుబాంబు... బాలుడికి తీవ్ర గాయాలు

By

Published : Nov 15, 2020, 6:52 PM IST

కర్నూలు జిల్లా సంజామల మండలం చెన్నంపల్లిలో నాటు బాంబు పేలి, 12 సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వరకుమార్ నడుచుకుని వెళ్తుండగా... గుండ్రంగా పడి ఉన్న వస్తువులను పట్టుకున్నాడు. ఈ క్రమంలో అవి పేలి చేతులు కాలిపోయాయని బాలుడి తండ్రి తెలిపారు. నాటు బాంబు పేలినచోట గాజుపెంకులు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స నిమిత్తం బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

పేలిన నాటుబాంబు... బాలుడికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details