కర్నూలు జిల్లా కోసిగిలో రసాయన మందు అంటుకున్న నేరేడు పండ్లు తిని ఒక బాలుడు మృతి చెందగా.. ముగ్గురు అస్పత్రి పాలయ్యారు. మహాదేవి అనే మహిళ... తన ఇద్దరు పిల్లలతోపాటు ఆడుకునేందుకు వచ్చిన పక్కింటి బాలుడు శ్రీరాములుకు నేరేడు పండ్లు ఇచ్చింది. తిన్న కాసేపటికే ఆమెతోపాటు పిల్లలూ సృహ కోల్పోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మాహాదేవి అత్త నరసమ్మ పొలం నుంచి నేరేడు పండ్లు కోసుకుని వాటిని.. రసాయన ఎరువులు ఉన్న కవర్‌లో ఇంటికి తెచ్చింది. అది గమనించక మహాదేవి తినడంతోపాటు పిల్లలకూ ఇచ్చింది. మహాదేవి కుమారుడు హర్ష ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. కర్నూలుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నేరేడుపండ్లు తిని బాలుడు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం.. అసలేమైంది..? - Boy dies after eating jamun
అప్పటివరకూ ఆడుతూ పాడుతూ ఉన్నారు... అప్పుడే ఇంట్లోకి వచ్చిన పిల్లలకు తల్లి నేరేడుపండ్లు ఇచ్చింది. అవి తిన్న కాసేపటికే ఆమెతో పాటు పిల్లలు స్పృహ కోల్పోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.. అయితే ఈ ఘటనకు రసాయన ఎరువులు ఉన్న కవర్‌లో నెరేడుపండ్లు పెట్టడమే కారణంగా తెలుస్తోంది.
jamun