ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయ్యో పాపం.. ఈతకు వెళ్లి బాలుడి మరణం - చింతకుంటలో ఈతకు వెళ్లి బాలుడు మృతి వార్తలు

ఆనందం కాస్తా.. విషాదాన్ని మిగిల్చింది. సరదాగా స్నేహితులతో కలిసి ఈత కోసం చెరువులో దిగిన బాలుడు.. ఆయాసంతో నీటిలో మునిగి చనిపోయిన ఘటన కర్నూలు జిల్లా పీ. చింతకుంటలో జరిగింది.

boy died while swimming in chinthakunta kurnool district
ఈతకు వెళ్లి బాలుడు మృతి

By

Published : May 23, 2020, 4:50 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని పీ. చింతకుంటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బాషా ఈత కొట్టడం కోసం సమీపంలోని చెరువుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో ఆయాసం వచ్చి నీటిలో మునిగిపోయాడు. అతని స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

వారు వెళ్లి గ్రామస్థులకు సమాచారమివ్వగా.. పోలీసులకు గాలింపు చేపట్టి 3 గంటల తర్వాత మృతదేహాన్ని వెలికితీయించారు. బాషా మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details