ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్ ఉల్లంఘన... ప్రాణం తీసింది! - చాపిరేవులో మృతుల వార్తలు

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన... ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో ఆట ఆడుతున్న యువకుడు.. పోలీసులకు వచ్చారన్నా భయంతో నదిలో దూకి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా చాపిరేవులలో జరిగింది.

boy died at chapirevu in kurnool
నదిలో దూకి ప్రాణాలు కొల్పోయిన యువకుడు

By

Published : Apr 22, 2020, 10:39 PM IST

నదిలో దూకి ప్రాణాలు కొల్పోయిన యువకుడు

కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవులలో విషాదం జరిగింది. గ్రామ సమీపంలోని కుందునదిలో ప్రసాద్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతనితో పాటు కొంతమంది కలిసి నది ఒడ్డున చింతపిక్కలాట ఆడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి రాగా… వారిని గమనించిన ప్రసాద్ పరుగెత్తి కుందునదిలో దూకాడు. ఎంత పిలిచినా పలకకపోవడం వల్ల.. యువకుడు మృతి చెందినట్లు పోలీసులు నిర్థరించారు. అతని మృతదేహం కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details