Boy died coconut piece stuck in his throat: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కపోయి పసిపిల్లాడు మృతి చెందిన విషాద ఘటన.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్ద కొర్పోలు గ్రామ శివారు వెంకట్‌తండాలో చోటు చేసుకుంది. ధారావత్ మాలు, కవిత దంపతులకు మణికంఠ అనే ఏడాది బాబు ఉన్నాడు. అయ్యప్పమాల వేసుకున్న ధారవత్ మాలు.. పూజ కోసం గుడికి వెళ్లాడు.
గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కొని చిన్నారి మృతి.. ఎక్కడంటే! - Boy died coconut piece stuck
Boy died coconut piece stuck in his throat: చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు ఏం తింటున్నారో కనిపెడుతూ ఉండాలి. వరంగల్ జిల్లాలో కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుపోయి ఓ బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కొబ్బరి ముక్క
కవిత ఇంటి పనిలో ఉండగా.. మణికంఠ కొబ్బరి ముక్క తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుపోయి శ్వాస ఆడలేదు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందాడు. కళ్ల ముందే చిన్నారిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో వెంకట్‌తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: