కర్నూలు జిల్లా సంజామల మండలం పెద్దవింతల గ్రామానికి చెందిన మనోజ్ కుమార్... తన తల్లిదండ్రులతో కలిసి అవుకు మండలంలోని కంబగిరి స్వామి ఆలయానికి వచ్చాడు. దైవం దర్శనం కోసం స్నానం చేసేందుకు గుండంలో దిగాడు. నీటిలో దిగిన కొద్ది సమయం తర్వాత మనోజ్ కుమార్కు మూర్ఛ వ్యాధి రావడంతో నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. దైవ దర్శనానికి వచ్చి ఇలా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
BOY DEATH : దైవ దర్శనానికి వచ్చి... అనంత లోకాలకు... - crime news in kurnool district
కర్నూలు జిల్లా అవుకు మండల పరిధిలోని కంబగిరి స్వామి ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు గుండంలో దిగిన బాలుడికి మూర్ఛ వ్యాధి రావడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.
నీటిలో మునిగి బాలుడు మృతి