ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ కేసులను త్వరగా పరిష్కరించాలని: బొప్పరాజు వెంకటేశ్వర్లు - ఏపీ జేఏసీ అమరావతి

రెవెన్యూ శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారించాలని ఏపీ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. క్రమశిక్షణ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వారు..ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలన్నారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు
బొప్పరాజు వెంకటేశ్వర్లు

By

Published : Feb 28, 2021, 4:30 PM IST

రెవెన్యూ శాఖలో ఉద్యోగుల మానసిక ఒత్తిడితో పాటు ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువైందని ఏపీ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న 1500 మంది ఉద్యోగులకు సంబంధించిన క్రమశిక్షణ కేసులను పెండింగ్ ఉంచారని.. 6 నెలల్లో పూర్తి చేయాల్సిన విచారణను సంవత్సరాల తరబడి చేపట్టడం లేదన్నారు. జిల్లా కలెక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నందున వారికి పింఛన్లు కుడా రాని పరిస్థితి నెలకొందని తెలిపారు. తప్ప చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో కేసును త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details