కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని చెన్నాపురం - బోడబండ మధ్య జాతీయ రహదారిపై వేగంగా వెళ్తూ బొలేరో వాహనం ఆవును ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఆవు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆవును ఢీకొన్న బొలేరో.. నలుగురికి గాయాలు - road accident at kurnool district
వెేగంగా ప్రయాణిస్తున్న బొలేరో వాహనం ఆవును ఢీకొన్న ఘటనలో.. ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో చోటు చేసుకుంది.
ఆవును ఢీకొన్న బొలోరో వాహనం
ఆవును ఢీకొన్న బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. గాయపడిన వారిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: