బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులు ప్రధాన నిందితుడు ఏవీ సుబ్బారెడ్డికి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో ఇవాళ వాదనలు జరగనున్నాయి.
ఏవీ సుబ్బారెడ్డికి 41సీఆర్‌పీసీ కింద నోటీసులు - ఏవీ సుబ్బారెడ్డికి సీఆర్‌పీసీ నోటీసులు
సంచలనం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవీ సుబ్బారెడ్డికి పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మరోవైపు భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో ఇవాళ వాదనలు జరగనున్నాయి.
ఏవీ సుబ్బారెడ్డికి 41సీఆర్‌పీసీ కింద నోటీసులు
ఆమె ఆరోగ్యానికి సంబంధించి దాఖలయిన పిటిషన్‌పై కూడా కోర్టు నేడు విచారణ జరపనుంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో అఖిలప్రియ రిమాండ్‌లో ఉన్నారు. పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:ఆ స్థలం విషయంలో.. రెండు వర్గాలు ఒక్కటయ్యాయా?