ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అఖిలప్రియ బెయిల్ పిటిషన్​పై ఉత్కంఠ! - సెసన్స్​ కోర్టులో అఖిల ప్రియ బెయిల్​ పిటిషన్​

బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్​ పిటిషన్​పై విచారణ సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరుగుతోంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం2.30 గంటలకు వాయిదా వేసింది. ఈ కేసులో ఏ3 గాఉన్న భార్గవరామ్​ బెయిల్​ పిటిషన్లపైన సెషన్స్​ కోర్టులో విచారణ జరుగుతోంది.

AKILA
AKILA

By

Published : Jan 22, 2021, 1:08 PM IST

Updated : Jan 22, 2021, 1:20 PM IST

బోయిన్​పల్లి అపహరణ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్​పై సందిగ్ధత కొనసాగుతోంది. అఖిల ప్రియ బెయిల్​ పిటిషన్​పై విచారణ చేపట్టిన సికింద్రాబాద్​ కోర్టు విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.

మరోవైరు అఖిలప్రియ భర్త భార్గవ్​రామ్​ ముందస్తు బెయిల్ పిటిషన్​పై సికింద్రాబాద్ న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి. అఖిల ప్రియ భర్త భార్గవ్​రామ్​కు ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో భార్గవ్ రామ్​కు ఎలాంటి సంబంధం లేదని... ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కేసులో ఏ3గా ఉన్న భార్గవ్​రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

భార్గవ్​రామ్​కు బెయిల్ మంజూరు చేయొద్దని.... భూవివాదం విషయంలో ముగ్గురు అన్నదమ్ములను అపహరించి, బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలను విన్న న్యాయస్ధానం తీర్పు వెలువరించనుంది. విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్​పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.

ఇదీ చూడండి:'రాధేశ్యామ్​'లో పరమహంసగా రెబల్​స్టార్​!

Last Updated : Jan 22, 2021, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details