ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎందరికో రక్తదానం చేసి.. తాను అసువులు బాసి! - కర్నూలులోని రక్తదాత రమేష్ మృతి వార్తలు

అపద సమయంలో ఎందరికో రక్తదానం చేసిన కర్నూలు జిల్లాకు చెందిన రక్తదాత రాగిమాన్ రమేష్ కరోనాతో మృతిచెందారు. 77 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు కాపాడిన రమేష్ మృతి.. స్థానికులను కలచివేసింది.

ఎందరికో రక్తదానం చేసి.. తాను అసువులు బాసి
ఎందరికో రక్తదానం చేసి.. తాను అసువులు బాసి

By

Published : May 17, 2021, 8:49 AM IST

కర్నూలు జిల్లాకు చెందిన రక్తదాత రాగిమాన్ రమేష్ కరోనాతో మృతిచెందారు. 77 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు కాపాడిన రమేష్ మృతి.. స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. యువ భారత్ సేవా సమితి స్థాపించిన ఆయన.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.

గత సంవత్సరం కరోనా సమయంలో ఎందరికో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రక్తదాత రమేష్ కొన్ని రోజులుగా జ్వరంతో బాదపడి.. మూడ్రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం మెరుగుపడక చికిత్స పొందుతూనే రమేష్ మృతిచెందారు.

ABOUT THE AUTHOR

...view details