ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.. మెరుగైన సేవలు అందిస్తున్నాం' - కర్నూలులో బ్లాక్ ఫంగస్ కేసులు తాజా వార్తలు

కర్నూలులో బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించినట్లు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. భయపడాల్సిందేమీ లేదని.. ఫంగస్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు.

'బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.. మెరుగైన సేవలు అందిస్తున్నాం'
'బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.. మెరుగైన సేవలు అందిస్తున్నాం'

By

Published : May 14, 2021, 3:31 PM IST

'బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.. మెరుగైన సేవలు అందిస్తున్నాం'

కర్నూలు నగరంలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయని సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. అయితే భయపడాల్సిందేమీ లేదని.. ఫంగస్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

అప్రమత్తంగా ఉండాలి..

యుక్త వయసు వారే అధికంగా కరోనా బారినపడుతుండటంపై నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకూ కరోనా సోకుతోందని.. అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆక్సిజన్ నిల్వలు, రెమ్​డెసివర్ ఇంజక్షన్లకు కొరత లేదని వివరించారు. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్న.. డా. నరేంద్రనాథ్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్యామ్ ముఖాముఖీ.

ఇవీ చూడండి :ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు

ABOUT THE AUTHOR

...view details