ఆర్థికంగా వెనుక బడిన తరగతుల వారి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన.. 10 శాతం రిజర్వేషన్ కోటాను రాష్ట్రంలో అమలు చెయ్యాలని బీజేవైయం నాయకులు డిమాండ్ చేశారు. యువమోర్చా ఆధ్వర్యంలో పేద, అగ్రవర్ణాల వారికి మద్దతుగా.. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. సీఎం జగన్ స్పందించి.. ఆ వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ ఏపీలో అమలు కాకపోవడంతో.. ఎంతో మంది ప్రతిభ గల విద్యార్ధులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు బీజేవైయం సంతకాల సేకరణ - ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు కర్నూలులో నిరసనలు
ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలంటూ బీజేవైయం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలులో కలెక్టర్ కార్యాలయం ముందు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థల అన్యాయం జరగకుండా అడ్డుకోవాలన్నారు.
సంతకాలు సేకరిస్తోన్న బీజేవైయం నాయకులు