భవిష్యత్తులో తెదేపా, వైకాపాలతో భాజపా పొత్తుపెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కర్నూలులో అన్నారు. 50 సంవత్సరాలగా రాయలసీమకు అన్యాయం జరుగుతునే ఉందన్నారు. ప్రతిపక్ష, అధికారపార్టీలు రాయలసీమ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం కేంద్రం ప్రభుత్వంపై ఏవిధంగా ఒత్తిడి చేస్తుందో... అలాగే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో యుద్దప్రాదిపదికన ప్రణాళిక విడుదల చెయ్యలని డిమాండ్ చేశారు.
పదివేల కోట్ల రుపాయల నిధులతో మూడు సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలన్నారు. రాయలసీమపై రెఫరెండం నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో బంగారం దొరుకుతుంది గాని ఇసుక దొరకడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక చౌకగా దొరికిందని.... ప్రస్తుతం ఇసుక సామన్యులకు అందుబాటులో లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ.వెంకటేశ్ పాల్గొన్నారు.