ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది: సోము వీర్రాజు - కర్నూలు వార్తలు

Somu Veeraju in MLC Election Campaign: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని చోట్లా బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

somu veerraju
somu veerraju

By

Published : Feb 8, 2023, 3:12 PM IST

Somu Veeraju in MLC Election Campaign: రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలో జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టులు, రైల్వేలను బీజేపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు.

కర్నూలులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సోము వీర్రాజు

"భారతదేశం ఖ్యాతిని అన్ని ప్రాంతాలకు వ్యాపించిన నేత నాయకత్వంలో.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పని చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపూర్వమైన స్పందన ఉంది. తప్పకుండా బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారు". - సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details