పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...టెండర్లను ఏకపక్షంగా రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలకు ఉపయోగపడని పనులను ప్రభుత్వం చేపడితే... తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భాజపా అవతరిస్తుందని విష్ణువర్ధన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలను... రైతు భరోసాలో చేర్చడం సరికాదన్నారు.
'రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భాజపాయే' - భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భాజపా అవతరిస్తుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు నగరంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
!['రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భాజపాయే'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4038777-262-4038777-1564920887582.jpg)
" రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భాజపాయే"
" రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భాజపాయే"
జమ్మూ కశ్మీర్‌పై ఆందోళన వద్దు... సునీల్ దియోదర్ ...
జమ్ముకశ్మీర్‌లో ఏదో జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని... భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజల భద్రత కోసమే... అమరనాథ్ యాత్రకులను వెనక్కు పంపిస్తున్నారని వివరించారు.
ఇదీ చూడండి: 'కృష్ణానీటిని తెలంగాణకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు'