BJP meeting in kurnool: రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. భాజపా ఆధ్వర్యంలో.. కర్నూలులో శనివారం ప్రజా నిరసన సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్టీ, బీసీ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ సభకు.. భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ సభను రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలయినా.. ఎక్కడ అభివృద్ధి కనబడడం లేదని విమర్శించారు. క్యాసీనో కు పాల్పడిన మంత్రి కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చెయ్యడం లేదని భాజపా నేత విఘ్ణవర్థన్ రెడ్డి ప్రశ్నించారు.
BJP meeting in kurnool: రేపు కర్నూలులో భాజపా 'ప్రజా నిరసన సభ' - కర్నూలులో భాజపా నిరసన సభ
BJP meeting in kurnool: రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. కర్నూలులో శనివారం ప్రజా నిరసన సభను నిర్వహిస్తున్నట్లు భాజపా నేతలు తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా.. ఎక్కడా అభివృద్ధి కనబడడం లేదని.. ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శించారు.
![BJP meeting in kurnool: రేపు కర్నూలులో భాజపా 'ప్రజా నిరసన సభ' BJP protests against anti-state government policies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14248600-1110-14248600-1642779771383.jpg)
రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా నిరసన సభ