బహిరంగ ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు, సామూహిక నిమజ్జనాలు జరుపుకోవద్దంటూ ప్రభుత్వం ఆదేశించడం..దుర్మార్గమని భాజపా విమర్శించింది. కర్నూలులో నిర్వహించిన ఆ పార్టీ రాయలసీమ జిల్లాల ముఖ్యనాయకుల సమావేశంలో పార్టీ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి.. రాజ్ విహార్ కూడలిలో నేతలు బైఠాయించి.. నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. వినాయక చవితి పండుగకు ప్రభుత్వం అనుమతిచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కేవలం హిందువుల వేడుకలపైనే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తత..