శ్రీశైల దేవస్థానం వ్యవహారాల్లో అన్యమతస్థులు జోక్యం చేసుకోవడాన్ని శ్రీశైలం మండల భాజపా నాయకులు ఖండించారు. దుకాణాల విస్తరణ పనులు చేస్తున్న వారిని అడ్డుకున్నారని.. కొందరు వైకాపా నాయకులు అధికారులను భయపెట్టిన వీడియోలతో కూడిన ఆధారాలను భాజపా నాయకులు బహిర్గతం చేశారు. కొందరు వ్యక్తులు, అధికారులు అన్యమతస్థులైన నాయకులకు ప్రాధాన్యతనిస్తూ.. అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
'శ్రీశైల దేవస్థానం వ్యవహారాల్లో అన్యమతస్థులు జోక్యం' - కర్నూల్ జిల్లా తాజా వార్తలు
హిందువున మనోభావాలు దెబ్బతీసేలా శ్రీశైల దేవస్థానం వ్యవహారాల్లో అన్యమతస్థులు జోక్యం చేసుకుంటున్నారని.. శ్రీశైల మండల భాజపా నాయకులు ఆరోపించారు. శ్రీశైలంలో భాజపా కార్యకర్తలకు వేధింపులు ఎక్కువయ్యాయని.. వీటిని అడ్డుకునేందుకు త్వరలో శ్రీశైలం ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని భాజపా నాయకులు తెలిపారు.
'శ్రీశైల దేవస్థానం వ్యవహారాల్లో అన్యమతస్థులు జోక్యం'
ఉద్యోగ, వ్యాపార, కాంట్రాక్టు పనుల్లో జోక్యం చేసుకుంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని నాయకులు మండిపడ్డారు. శ్రీశైలంలో భాజపా కార్యకర్తలకు వేధింపులు ఎక్కువయ్యాయని.. వైకాపా ఆగడాలను అడ్డుకోవడానికి త్వరలో శ్రీశైలం ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని భాజపా మండల అధ్యక్షులు ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చదవండి: నల్లమల ఘాట్ రోడ్డులో 6 గంటలు ట్రాఫిక్ జాం.. చక్కదిద్దిన పోలీసులు