ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హిందువులపై దాడులకు ముఖ్యమంత్రి​ సమాధానం చెప్పాలి' - bjp leaders agitation in kurnool news

రాష్ట్రంలో హిందువులు, దేవాలయాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. కర్నూలులో పూజారిపై దాడి చేసిన వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

bjp leaders agitation
ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజాపా నాయకుల ఆందోళన

By

Published : Dec 2, 2020, 5:15 PM IST

ఆలయాలు, హిందువులపై దాడులు ఆపాలని భాజపా నేతలు, కార్యకర్తలు కర్నూలులో ఆందోళన నిర్వహించారు. జగన్​ అధికారం చేపట్టాక హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తూ..వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి అన్నారు. పూజారులపై దాడులు జరిగినా.. ముఖ్యమంత్రి స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు.

వైకాపా ప్రభుత్వ హయాంలో హిందువులు, ఆలయాల విషయంలో ఎందుకు దారుణంగా వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పాలని రామస్వామి ప్రశ్నించారు. అర్చకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. హిందూ సమాజానికి భాజపా ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. దాడులు ఇలాగే కొనసాగితే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: 'ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తా'

ABOUT THE AUTHOR

...view details