రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసంపై రావెల కిషోర్ బాబు కర్నూలు భాజపా కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. ఛలో రామతీర్థం కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీజేపీ నాయకులను గృహనిర్బంధం, అరెస్టులు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా అధ్యక్షుడినే అరెస్టు చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా రావెల అభివర్ణించారు.
సోమువీర్రాజు అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: రావెల - భాజపా నాయకుడు రావెల కిషోర్ బాబు కర్నూలులోని పార్టీ కార్యాలయంలో మాటలు
భాజపా నాయకుడు రావెల కిషోర్ బాబు కర్నూలులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఛలో రామతీర్థం కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేతలను గృహనిర్బంధించడంపై ఆయన మండిపడ్డారు.
రావెల కిషోర్ బాబు కర్నూలులోని పార్టీ కార్యాలయంలో
కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామని రావెల హామీ ఇచ్చారు. విశాఖలో కృష్ణాబోర్డు కార్యాలయం పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. దానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చదవండి:ఆడమ్ స్మిత్ హంతకులను కఠినంగా శిక్షించండి: ఎమ్మార్పీఎస్