ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌరసత్వ బిల్లుపై అపోహాలు వద్దు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి - baireddy rajashaker reddy comments on CAB news

పౌరసత్వ బిల్లు విషయంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

bjp-leader-baireddy-rajashaker-reddy-comments-on-cab
bjp-leader-baireddy-rajashaker-reddy-comments-on-cab

By

Published : Dec 15, 2019, 9:26 PM IST

పౌరసత్వ బిల్లుపై అపోహలు వద్దన భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి
రానున్న రోజుల్లో రాష్ట్రంలో భాజపా సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో భాజపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... ప్రధాని మోదీ వల్ల సీమ ప్రాంతానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా పోటీలో ఉంటుందన్నారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. పౌరసత్వ బిల్లు విషయంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details