గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదీ జలాలను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని భాజపా నాయకులు కర్నూల్ లో అన్నారు. తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తున్న కర్నూల్లో వేసవి కోసం నిల్వ చేసుకునే సదుపాయంలేదని తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా పందిపాడు వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునే వీలు ఉంటుందన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కర్నూలు జిల్లాలోని 106 చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.
నదీ జలాల వినియోగంలో ప్రభుత్వం విఫలం: భాజపా
కర్నూలులో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తున్నా.. వాటిని నిల్వచేసుకునే సదుపాయం లేదని భాజపా నేతలు అన్నారు.
భాజపా