భాజపా నాయకులపై వైకాపా చేస్తున్న దాడులను ఆపకపోతే కేంద్ర హోంశాఖ, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కర్నూలులో భాజపా కార్యకర్త హసన్‌పై దాడి చేసిన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షం నుంచి తీసుకెళ్లిన తమ పార్టీ కార్యకర్తను హత్య చేసేందుకు యత్నించారని, నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయకుండా బెయిల్‌పై వదిలేశారని మండిపడ్డారు.
'భాజపా నాయకులపై జరుగుతున్న దాడులను ఆపకపోతే ఆందోళన నిర్వహిస్తాం' - భాజపా నాయకులపై దాడుల వార్తలు
భాజపా నాయకులపై వైకాపా చేస్తున్న దాడులు నిలువరించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేెశారు. అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించినందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భాజపా నేతలపై దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హసన్‌పై దాడి ఘటనలో పక్షపాతంతో వ్యవహరించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా నేతల అవినీతిని ప్రశ్నించినందుకు పలు జిల్లాలో భాజపా నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయన్నారు. వీటిని వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని విష్టువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి:'అక్కాచెల్లెమ్మల భద్రత-జగనన్న ప్రభుత్వ బాధ్యత' అంటూ కపట ప్రకటనలు