రైతు సదస్సుకు హాజరయ్యేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చేరుకున్నారు. పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖ న్యాయవాది, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామచంద్రరావు ఇంట్లో.. వైద్యులు, న్యాయవాదులతో వీర్రాజు సమావేశం నిర్వహించారు. భాజపాను ఆదరించాలని కోరారు.
రైతు సదస్సు కోసం నంద్యాలకు చేరుకున్న సోము వీర్రాజు - నంద్యాలలో వైద్యులు, న్యాయవాదులతో సోము వీర్రాజు సమావేశం
కర్నూలు జిల్లా నంద్యాలలో ఈరోజు జరుగనున్న రైతు సదస్సుకు.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరుకానున్నారు. ఇప్పటికే పట్టణానికి చేరుకున్న ఆయన.. స్థానిక వైద్యులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. పార్టీని ఆదరించాలని కోరారు.

నంద్యాలలో మాట్లాడుతున్న సోము వీర్రాజు