కర్నూలులో
కర్నూలులో వైకాపా నాయకుల సంబరాలు కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేసేలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టినందుకు...జిల్లాను జ్యుడీషియల్ క్యాపిటల్ చేసినందుకు కర్నూలులో వైకాపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని రాజ్ విహర్ కూడలిలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతపురంలో
అనంతపురంలో వైకాపా నాయకుల సంబరాలు హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనంతపురంలో వైకాపా విద్యార్థి సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వైకాపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మంత్రవర్గంలో తీసుకున్న నిర్ణయం అఖిలపక్ష పార్టీలకి బుద్ధి చెప్పే విధంగా ఉందని వైకాపా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి అన్నారు.
ఇదీ చూడండి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే...