ముందున్న లారీని దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తి… బైక్ అదుపు తప్పడం వల్ల లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామం వద్ద జరిగింది. మృతుడు ఆలూరు మండలం అగ్రహారానికి చెందిన రాముగా పోలీసులు గుర్తించారు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
క్రేన్ తీసుకెళ్తున్న లారీ కింద పడి వ్యక్తి మృతి - bike accident at arikera village
ఆలూరు మండలం అరికెర గ్రామ సమీపంలో క్రేన్ తీసుకెళ్తున్న లారీని దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్రవాహనదారుడు లారీ కింద పడి మృతి చెందాడు. ఘటనపై ఆలూరు ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.

లారీ దాటించబోయి ద్విచక్రవాహనదారుడు మృతి