శ్రీశైల దేవస్థానం ఆర్జిత సేవల దర్శనం టిక్కెట్ల విక్రయాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది. బ్యాంకుల తరఫున టికెట్ కౌంటర్లో పనిచేసే పొరుగు సేవల సిబ్బంది మూడేళ్ల నుంచి ఇప్పటివరకు రూ.1.42 కోట్ల అవినీతి జరిగినట్లు దేవస్థానం అధికారులు గుర్తించారు. అవినీతి జరిగిందని ఫిర్యాదు అందగానే దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు ఏఈఓ హరిదాసును విచారణ అధికారిగా నియమించారు.
కంప్యూటర్లలోని సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.