ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నేను కేసులకు భయపడే రకం కాదు' - భూమా అఖిల ప్రియపై వార్తలు

తనపై ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి భూమా అఖలప్రియ ఖండించారు. తాను కేసులకు భయపడే రకం కాదని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ సమయంలో అహోబిలంలో గంగుల.. కుటుంబ సమేతంగా పూజలు చేయటం నిబంధనలను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేశారు.

bhuma akila priya on ysrcp mlc
ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ పై అఖిల ప్రియ ఆగ్రహం

By

Published : May 9, 2020, 3:32 PM IST

తాను కేసులకు భయపడే రకం కాదని తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. 'భయపడి హైదరాబాద్ లో దాక్కున్నావ్' అని వైకాపా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నంలో తన పాత్ర ఉందని గంగుల అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. లాక్​డౌన్ సమయంలో అహోబిలంలో గంగుల తన కుటుంబ సమేతంగా పూజలు చేయటం నిబంధనలను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై హైకోర్టులో పిల్ వేస్తానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details