రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోందని మాజీ మంత్రి తెదేపా నేత భూమా అఖిలప్రియ విమర్శించారు. ఆళ్లగడ్డలోని తన నివాసంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే వైకాపా నాయకులు ప్రశాంతంగా ఉన్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు. అమరావతి మార్పుతో రాజధాని రైతులు చేసిన త్యాగాలు వృధా అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేయటం దారుణమన్నారు. వైకాపాకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు నేడు తలలు పట్టుకుంటున్నారన్నారు. అమరావతిలో రైతుల కష్టాలు చూసి రాయలసీమలోని రైతులు కూడా చలించి పోతున్నారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు.
'రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోంది'
రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. కర్నూలులో మాట్లాడిన ఆమె ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ