కేసుల విషయాల్లో ప్రభుత్వంపై నమ్మకం లేదని.. సీబీఐ విచారణ చేయాలని గతంలో జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేసిన విషయాన్ని మాజీమంత్రి అఖిల ప్రియ గుర్తు చేశారు. సలాం కుటుంబానికి న్యాయం చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముసాక్ అహమ్మద్ చేపట్టిన 55 గంటల దీక్షా శిబిరాన్ని అఖిల సందర్శించారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే.. సీఎం జగన్ సోదరి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిందన్నారు. ఇదే క్రమంలో సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని అఖిల ప్రియ డిమాండ్ చేశారు.
'సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి' - సలాం ఫ్యామిలీ ఆత్మహత్యపై భూమా అఖిల ప్రియ కామెంట్స్
సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని మాజీమంత్రి అఖిల ప్రియ డిమాండ్ చేశారు. సలాం కుటుంబానికి న్యాయం చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముసాక్ అహమ్మద్ చేపట్టిన 55 గంటల దీక్షా శిబిరాన్ని అఖిల సందర్శించారు.
'సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి'