తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నంపై కడప పోలీసులు నమోదు చేసిన కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఏవీ సుబ్బారెడ్డికి, తమకు మధ్య ఆర్థిక లావాదేవీలు లేవని ఆమె స్పష్టం చేశారు. రాజకీయంగా తమ ఎదుగుదలను సహించలేకే.... తమపై హత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.... తమను అరెస్టు చేయాలని సుబ్బారెడ్డి కోరడం విడ్డూరంగా ఉందని అఖిలప్రియ అన్నారు.
'ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణకు సహకరిస్తాం' - ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు వార్తలు
ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణకు సహకరిస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. రాజకీయ ఎదుగుదలను సహించలేకే కొందరు తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
bhuma akhila priya cooperate with Subbaradi's murder case
Last Updated : Jun 5, 2020, 5:17 PM IST