ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్దులను వైకాపా నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డికి మాజీమంత్రి భూమా అఖిల ఫిర్యాదు చేశారు. తెదేపా అభ్యర్దుల నామినేషన్లపై ఫోర్జరీ సంతకాలు చేసి.... విత్ డ్రా చేసుకున్నట్లు వైకాపానేతలు బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. తమ అభ్యర్దులు ఎక్కడా సంతకాలు చేయలేదని... నామినేషన్ల విత్ డ్రాలపై స్పష్టత ఇవ్వాలని జేసీను కోరానని అఖిల ప్రియ స్పష్టం చేశారు.
వైకాపా వాళ్ల మాటలు విని పోలీసులు అక్రమ కేసులు పెడితే...తాము కూడా ఎదురు కేసులు పెడతామని అఖిల ప్రియ హెచ్చరించారు. ఓట్లు వేయకపోతే పింఛన్లు, ఇళ్లు ఇవ్వమని ఆళ్లగడ్డలో వైకాపా నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని అఖిల ప్రియ విమర్శించారు.