కర్నూలులో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ముందుగా భోగి పండుగను నగర ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసుకొని మహిళలు నృత్యాలు చేశారు.
చాణక్యపురి కాలనీ వాసులు అందరూ కలిసి సామూహికంగా భోగి వేడుకలు చేశారు. సామూహికంగా అందరూ కలిసి భోగి మంటలు వేసి, అందులో పాత వస్తువులు దహనం చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా తుడుచుకుని పోవాలని.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ భోగి మంటలు వేసుకునట్లు నగర వాసులు తెలిపారు.. మహిళలు ఇళ్ల ముందు సంక్రాంతి ముగ్గులు వేశారు.
ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరులో భోగి సందర్భంగా ప్రజలు తెల్లవారుజామున ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. మంటల్లో కట్టెలు పనికి రాని వస్తువులు వేసి సంబరాలు చేసుకున్నారు.
నంద్యాలలో...