ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురు యువకులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.85 వేల నగదుతో పాటు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. పట్టణంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. ఆర్ఆర్లేబర్ కాలనీ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏడుగురు యువకులు పట్టుబడ్డారు. యువత ఇలాంటి జూదాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని.. ఈ తరహా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాములు హెచ్చరించారు.
ఇదీ చదవండి: