నంద్యాల సమీపంలో కుందునదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సంతజుటూరు వద్ద 16,000 కూసెక్కుల నీటిని కుందునదిలో విడుదల చేశారు. దీంతో నంద్యాల వద్ద నది పరవళ్లు తొక్కి జలకళ సంతరించుకుంది. ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. 20 వేల కూసెక్కుల నీరు కుందునదిలో ప్రవహించే అవకాశం ఉంది.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందునది - నంద్యాల
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందునది ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.
కుందునది