కర్నూలు జిల్లా అవుకు మండలంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎర్రమల కొండల్లో కురిసిన భారీ వర్షాలతో మంగంపేట జలపాతం జలకళను సంతరించుకుంది. తెల్లటి పాలలాంటి నురగతో కొండల నడుమ నుంచి జాలువారే నీటి అందాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.
మంగంపేట జలపాత అందాలు అదరహో...! - mangampeta waterfalls latest
కర్నూలు జిల్లా అవుకు మండలంలో జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మంగంపేట జలపాతం వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. కొండల నడుమ జాలువారే నీటిని చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.
జలపాతం వద్ద పర్యాటకుల తాకిడి