కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లికి చెందిన లింగన్న వృత్తి రీత్యా రైతు. ఈయన 4 సార్లు సర్పంచ్‌గా గెలుపొందారు. తెదేపా మద్దతుదారుడుగా బావిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. నాలుగో సారి మాత్రం ఒక్క ఓటుతో గెలిచారు. తాను గ్రామానికి చేసిన పనులే సర్పంచ్‌గా మరోసారి గెలిపించాయని లింగన్న తెలిపారు.
ఏ నాయకుడినైనా పేరు చెబితే గుర్తు పడతారు.. కానీ లింగన్నను మాత్రం గ్రామం పేరుతో కలిపి బావిపల్లి లింగన్న అని చెబితేనే గుర్తు పట్టేలా.. గ్రామ పేరునే ఆయన ఇంటిపేరుగా చేసుకున్నారు.