కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వీధుల్లో భక్తులు విహరించకుండా అధికారులు బారికేడ్లు ఎర్పాటు చేశారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున... మంత్రాలయానికి వచ్చే భక్తులు స్వామి దర్శనం అనంతరం మఠం వీధుల్లో గుమిగూడకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాఘవేంద్ర స్వామి మఠంలో నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.
మంత్రాలయంలో భక్తులు గుమిగూడకుండా.. బారికేడ్లు ఏర్పాటు - raghavendhra swamy temple in kurnool district
కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని... వివిధ రాష్ట్రాల నుంచి మంత్రాలయానికి వచ్చే భక్తులపై మఠం అధికారులు ఆంక్షలు విధించారు. ఆలయ పరిసరాల్లో భక్తులు గుమిగూడకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు.

మంత్రాలయంలో భక్తులు గుమిగూడకుండా బారికేడ్లు ఏర్పాటు