ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకు పోలీసులు వివిధ పద్ధతుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ట్రాఫిక్ పోలీసులు బ్యానర్లతో అవగాహన కల్పించారు. పట్టణంలో శ్రీనివాస సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో రాజశేఖరరెడ్డి విగ్రహం చుట్టూ ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కనిపించే మూడు సింహాలు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులైతే ..కనబడని నాలుగో సింహం మీరే అంటూ బ్యానర్లు కట్టారు.
సామాజిక దూరం లేకుంటే సమాదే గతి - lockdown in nandyala
కరోనా కట్టడికై లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో నిమగ్నులై ఉన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ట్రాఫిక్ పోలీసులు బ్యానర్లతో ప్రజలకు అవగాహన కల్పించారు.

నంద్యాలలో కరోనాపై బ్యానర్లు