ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో నిరసన ర్యాలీ చేశారు. పట్టణంలోని శ్రీనివాస్ భవన్ కూడలి నుంచి ప్రధాన స్టేట్ బ్యాంక్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం బ్యాంక్ దగ్గర ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు ఉన్నారని అన్నారు. ఆదోనిలో 200 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని యూనియన్ నాయకులు తెలిపారు.
కర్నూలులో బ్యాంకు ఉద్యోగుల నిరసన - కర్నూలు జిల్లా వార్తలు
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ కర్నూలు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 200 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని యూనియన్ నాయకులు తెలిపారు.
కర్నూలులో బ్యాంకు ఉద్యోగుల నిరసన