ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంక్​లో చోరీకి యత్నం.. డాక్యుమెంట్లు చెల్లా చెదురు - కర్నూలు వార్తలు

కర్నూలు జిల్లా మంత్రాలయం సహకార పరపతి సంఘం బ్యాంక్​లోకి అర్ధరాత్రి కొందరు దుండగులు చొరబడ్డారు. చోరీ చేసేందుకు నగదు ఏమీ కనిపించకపోవటంతో బీరువాలోని డాక్యుమెంట్లు చెల్లా చెదురు చేశారు. దొంగలు దేని కోసం బ్యాంకులోకి ప్రవేశించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

bank robbery at mantralayam
బ్యాంక్​లో చోరీకి యత్నం

By

Published : Jan 22, 2021, 4:06 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం సహకార పరపతి సంఘం బ్యాంక్​లో దుండగులు చోరీకి యత్నించారు. బ్యాంకు తాళాలు పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. బీరువా తెరిచి డాక్యుమెంట్లు చెల్లా చెదరు చేశారు. డబ్బులు ఏమీ దొరకకపోవడంతో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details