వైకాపా ప్రభుత్వ పాలన తీరును నిరసిస్తూ కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య కలెక్టర్ కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. వైకాపాకు ఓటు వేసినందుకు ప్రజలు బాధ పడుతున్నారని.. బంగి అనంతయ్య రోడ్డుపై చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోయాయని... వైకాపా ప్రభుత్వం కేవలం చంద్రబాబునాయుడుపై కక్ష సాధించేందుకే సమయం కేటాయిస్తుందని ధ్వజమెత్తారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... సీఎం అమెరికా పర్యటన చేయడమేంటని బంగి నిలదీశారు.
వరదలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ వినూత్న నిరసన - tdp
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య అర్థనగ్న ప్రదర్శన చేశారు. వైకాపాకు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువచ్చినందుకు ప్రజలు బాధపడుతున్నారని రోడ్డుపై చెప్పుతో కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
అర్థనగ్నంగా.... చెప్పుతో కొట్టుకొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న బంగి అనంతయ్య
Last Updated : Aug 21, 2019, 3:35 PM IST